పని కల్పించండి అంటూ ఎంతో మంది ఇళ్ల ముందు నిలుచున్నా : బాబీ దేవోల్

Telugu Lo Computer
0


తంలో అవకాశాల కోసం తాను ఎదుర్కొన్న సమస్యల గురించి ఓ షోలో బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్‌ వెల్లడించారు. పని కల్పించండి అంటూ ఎంతో మంది ఇళ్ల ముందు నిలుచున్నానంటూ గుర్తు చేసుకున్నారు. ''విజయాలే కాదు నా జీవితంలో కష్ట కాలం కూడా ఉంది. పని కోసం ఎంతో మంది ఇళ్ల ముందు నిలబడ్డాను. నేను బాబీ దేవోల్‌ను, నాకు ఏదైనా పని అప్పగించండి అంటూ వారి తలుపులు తట్టా. మనకు పని కావాల్సినప్పుడు మరొకరిని దాని గురించి అడగడంలో తప్పులేదని నా అభిప్రాయం. ఈ విషయంలో ఏ మాత్రం సిగ్గు పడాల్సిన అవసరం లేదు. కనీసం బాబీ దేవోల్‌ తమను కలవడానికి వచ్చారనే విషయం వారికి గుర్తుకు ఉంటుందని అనుకుంటున్నా'' అని అన్నారు. ఇండస్ట్రీలో పరిణామాలు, అవకాశాలపై బాబీ దేవోల్‌ మాట్లాడుతూ ''నేను పరిశ్రమలోకి అడుగు పెట్టిన కొత్తలో ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తోంది. నాడు నేరుగా ఆఫర్లు వస్తుండేవి. కానీ, ఇప్పుడు ఎంతో మంది ఇండస్ట్రీలోకి వస్తున్నారు. నటీనటుల సంఖ్య పెరిగింది'' అని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా సందీప్‌ వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌లో విలన్‌ పాత్రలో నటించిన బాబీ దేవోల్‌ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రకాశ్‌ ఝా డైరెక్షన్‌లో ఆశ్రమం సీజన్‌ 3 పార్ట్‌2లో నటించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)