మన శరీరానికి ప్రోటీన్ ఎంతో అవసరం. ఇది శరీరానికి బలాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది. చాలామంది కోడి గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని దీని ఆప్షన్ గా తీసుకుంటారు. వెజిటేరియన్స్ ఎగ్స్ ని తినరు. ఒక ఎగ్ లో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కానీ, కొన్ని ఫుడ్ ఐటమ్స్ దానికి మించిన ప్రోటీన్లను ఇస్తాయి. శాఖాహారులకు గుమ్మడి గింజలు కోడుగుడ్డు తిన్న బలాన్ని ఇస్తాయి. ఈ గింజలు చాలా చిన్నగా ఉంటాయి. కానీ, శరీరానికి ఎంతో శక్తివిస్తాయి. సుమారు 28 గ్రాములు గింజలలో 8.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో జింక్, ఐరన్, మెగ్నీషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని సలాడ్ లో, స్మూతీలో కలుపుకోవచ్చు. బ్రెడ్ లో వేసి బ్రేక్ చేసుకోవచ్చు. రోజు ఒక గుప్పెడు తింటే శరీరంలో స్టామినా పెరుగుతుంది. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. 100 గ్రాముల పన్నీరులో 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని అంచనా. ఈ విషయంలో గుడ్డు కంటే చాలా బెటర్. దీని రుచి న్యూట్రల్ గా ఉంటుంది. దీనిని ఏ వంటకంలోనైనా వాడుకోవచ్చు. దీనిలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలను బలంగా ఉంచుతుంది. ఇండియాలో పన్నీర్ టీక్కా, బుజ్జి లాంటివి చాలా ఫేమస్. ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సుమారు 32 గ్రాముల బాదం బటర్ లో 7 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. బాదం నువ్వు పేస్టులా చేసి కొద్దిగా దాల్చిన చెక్క లేదా వెన్నెల వేస్తే రుచి అదిరిపోతుంది. గుండెకు మంచి ఫ్యాట్,విటమిన్ E, ఇస్తుంది. రోజు కొన్ని బాదం పప్పులు తింటే చర్మం నిగనిగలాడుతుందని అధ్యయనాలలో తెలింది. లావు శనగలు లేదా కాబూలీ చనా ఇండియన్ కిచెన్ లో సర్వసాధారణం. సుమారు 80 గ్రాముల శనగలల్లో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఎగ్స్ కంటే బెటర్. సూపులో, సలాడ్లో వేస్తే రుచితో పాటు పోషకాలు కూడా అందుతాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, డైజేషన్ బాగా అవుతుంది.
కోడి గుడ్లకు ప్రత్నాయం గుమ్మడి గింజలు, పన్నీరు,లావు శనగలు, బాదం
March 23, 2025
0
Tags