విడదల రజినిపై పోలీసులకు ఫిర్యాదు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని గతంలో ఆమె అక్రమాలను ప్రశ్నించిందుకు తన ఇంటిపై దాడి చేశారని, తన కుటుంబాన్ని మానసికంగా హింసించారని చిలకలూరిపేటకు చెందిన రావు సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2022 ఏప్రిల్​లో రజిని మనుషులు తన ఇంటిపైకి వచ్చి దాడి చేశారని, ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురి చేశారని సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. అప్పట్లోనే తాను ఫిర్యాదు చేయగా, నామమాత్రంగా కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. రజిని, ఆమె మరిది గోపిపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)