గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది.130 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. సంధి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో గాజాలోని హమాస్ లక్ష్యంగా ఐడీఎఫ్, ఐఎస్‌ఏ దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులకు ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. 'మా బందీలను విడుదల చేయడానికి హమాస్ పదేపదే నిరాకరిస్తుంది. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించింది. ఈనేపథ్యంలోనే దాడులకు ఆదేశించాం. యుద్ధం లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు చేస్తోంది' అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇజ్రాయెల్ ఇప్పటినుంచి హమాస్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలోనే హమాస్ కీలక ప్రకటన చేసింది. ఈ తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తమ కాల్పుల విరమణను ఉల్లంఘించి బందీలను ప్రమాదంలో పడేశారని పేర్కొంది.
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు : 130 మందికి మృతి
March 18, 2025
0
Tags