మహీంద్రా XUV 3XO ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మహీంద్రా XUV 3XO EV టెస్టింగ్ సమయంలో రోడ్డు మీద చాలా సార్లు కనిపించింది.గత సంవత్సరం తన ప్రముఖ కాంపాక్ట్ SUV XUV 300 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా XUV 3XO ను విడుదల చేసింది. XUV 3XO విడుదలైనప్పటి నుండి కస్టమర్లను తెగ ఆకట్టుకుంటుంది. ప్రతి నెలా సగటున 9,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. రాబోయే ఎలక్ట్రిక్ SUV లో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, C-టైపు LED డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉంటాయని భావిస్తున్నారు. ఈ EV కుడి ఫ్రంట్ ఫెండర్ పైన ఛార్జింగ్ పోర్ట్ తో వస్తుంది. దీనితో పాటు ఈ EV లో అప్ డేటెడ్ ఫ్రంట్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్ కూడా ఉన్నాయి. మరోవైపు, వెనుక భాగంలో, EV కనెక్ట్ చేయబడిన LED టెయిల్ లాంప్‌లతో రాబోతుంది. ఫీచర్ల పరంగా EV 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. ఈవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని అంచనా. మార్కెట్లో ఈ ఈవీ.. టాటా పంచ్ EV, సిట్రోయెన్ eC3, MG విండ్సర్ EV, ఎంట్రీ-లెవల్ నెక్సాన్ EV వంటి మోడళ్లతో పోటీ పడనుంది.
మహీంద్రా XUV 3XO ఎలక్ట్రిక్ కారు !
February 03, 2025
0
Tags