వెంకటేశ్వర హేచరీస్ ఆధ్వర్యంలో బర్డ్ ఫ్లూపై ప్రజలకు అవగాహన కార్యక్రమం !

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో బర్డ్ ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫ్రీ చికెన్ పంపిణీ కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. ఎలాంటి వైరస్‌లు ఉన్నా 70 డిగ్రీల వేడిలో వండడం ద్వారా ఎలాంటి సమస్యలు ఉండవని నిర్వాహకులు పేర్కొన్నారు. చికెన్ ఫ్రై, చిల్లి చికెన్, ఎగ్ తినేందుకు పట్టణ ప్రధాన రహదారిపై ప్రజలు బారులు తీరారు. 200 కేజీల చికెన్ మరియు 2000 ఎగ్స్ పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతుందన్న భయంతో చికెన్‌కు ప్రజలు దూరంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో వారికి అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం పెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ చికెన్ ద్వారా వైరస్ వస్తుందన్న భయం ప్రజల్లో లేకపోలేదని చెప్పుకోవచ్చు. జిల్లాలో వందలాదిగా చికెన్ దుకాణాలు గత కొన్ని రోజులుగా తెరవని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బాయిలర్ కోళ్లతో పాటు నాటు కోళ్లకు సైతం వైరస్ వస్తుందన్న ప్రచారం జరగడంతో ప్రజలంతా మటన్ వైపే ప్రస్తుతం దృష్టి సారిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫ్రీ చికెన్ పంపిణీ కార్యక్రమం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గుంటూరు, కాకినాడతో పాటు అనేక ప్రాంతాల్లో ఈ ఫ్రీ చికెన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో వేలాదిగా ప్రజలు తినేందుకు ఎగబడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)