చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను, ఇది దురదృష్టకరమైన ఘటన అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రంగరాజన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా కాకుండా, ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా అర్చకులు రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు సేవలు అందిస్తున్నారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పుకుంటూ ఒక గ్రూపు అర్చకులు రంగరాజన్ పై దాడి చేయడానికి గల కారణాలేంటో పోలీసులు నిగ్గు తేల్చాలి. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని పవన్ కళ్యాణ్ కోరారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం రంగరాజన్ పలు విలువైన సూచనలను నాకు అందించారు. టెంపుల్ మూమెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో నాకు తెలిపారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఎంతో తపించే వ్యక్తి ఆయన అలాంటి ఆయనపై వీరరాఘవరెడ్డి, అతడి గ్రూపు చేసిన దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలి. చిలుకూరు వెళ్లి అర్చకులు రంగరాజన్ ని పరామర్శించాలని, వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వాలని జనసేన తెలంగాణ విభాగాన్ని ఆదేశించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
రంగరాజన్‌పై దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్ !
February 10, 2025
0
Tags