'కబాలి' నిర్మాత కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్య !

Telugu Lo Computer
0


'కబాలి' సినిమా తెలుగు నిర్మాత, డ్రగ్స్ వ్యవహారంలో  విమర్శల పాలైన కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్య కారణాలతో, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేపీ చౌదరి పూర్తి పేరు కృష్ణ ప్రసాద్ చౌదరి. 2016 లో సినిమా రంగంలోకి వచ్చాడు. అతడు 'కబాలి' సినిమా తెలుగు వెర్షన్కు నిర్మాతగా వ్యవహరించాడు. అంతేకాకుండా పలు తెలుగు, తమిళ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్గా పనిచేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాడు. సినీ రంగం కేపీ చౌదరికి పెద్దగా కలిసిరాలేదు. సినీ రంగంలో చేతులు కాల్చుకున్న కేపీ చౌదరి ఆ నష్టాలను పూడ్చుకోవడానికి డ్రగ్స్ దందాలోకి దిగాడు. ఇందులో భాగంగానే గోవాలో ఓహెచ్ఎం పబ్ను స్టార్ట్ చేశాడు. గోవాకు వచ్చిన సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)