త్వరలో కులగణనకు చట్టబద్దత కల్పిసాం : సీఎం రేవంత్

Telugu Lo Computer
0


దేశంలో మరే రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణలో కుల గణనను తాము పకడ్బందీగా, శాస్త్రీయంగా నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చరిత్రలో ఇంత పకడ్బందీగా ఎవరూ చేసి ఉండరని వ్యాఖ్యానించారు. త్వరలోనే కులగణనకు చట్టబద్ధత కల్పిస్తామని ఈ సందర్బంగా ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఓబీసీల సంఖ్య ముస్లింలతో సహా 51% ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56.33కి పెరిగిందని అన్నారు. అప్పటి కంటే దాదాపు 5.5% పెరిగినా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో అర్థం లేదని తెలిపారు. ఇదివరకు 21% ఉన్న ఓసీల సంఖ్య ఇప్పుడు 15.79%కి పడిపోయిందని, అలాంటప్పుడు ఓసీల సంఖ్య పెరిగినట్లా, తగ్గినట్లా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)