భార్యపై అనుమానంతో మూతికి ఫెవిక్విక్‌ వేసిన భర్త

Telugu Lo Computer
0


కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం జిల్లా నెలమంగల తాలూకా హారోక్యాతనహళ్లిలో సిద్ధలింగయ్య, భార్య మంజుల దంపతులు ఉంటున్నారు. వీరికి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. మంజుల గార్మెంట్స్‌ ఫ్యాక్టరీలో, సిద్ధలింగయ్య ఆయుర్వేద ఔషధ కంపెనీలో పని చేస్తున్నారు. భార్యపై అనుమానంతో అతడు తరచూ గొడవపడేవాడు. మంగళవారం అతని పైశాచికం శృతి మించింది. ఆమె మూతిపై ఫెవిక్వక్‌ అతికించి పరారయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మాదనాయకనహళ్లి పోలీసులు బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు గమ్‌ను తొలగించారు. సిద్ధలింగయ్యను పోలీసులు అరెస్టు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)