హిందూపురం మున్సిపాలిటీ ఛైర్మన్‌గా రమేశ్‌ ఎన్నిక !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం మున్సిపాలిటీని తెదేపా కైవసం చేసుకుంది. మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఆరో వార్డు కౌన్సిలర్‌ రమేశ్‌ ఎన్నికయ్యారు. ఆయనకు 23 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్‌లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. 40 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో 23 మంది మద్దతు పలకడంతో మున్సిపల్ ఛైర్మన్‌గా రమేశ్‌ ఎన్నికయ్యారు. వైకాపా అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. ముగ్గురు సభ్యులు గైర్హాజరయ్యారు. ఏలూరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. వీటిని తెదేపా కైవసం చేసుకుంది. మొదటి డిప్యూటీ మేయర్‌గా ఉమామహేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో డిప్యూటీ మేయర్‌గా దుర్గాభవాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారు ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా తెదేపా మద్దతు అభ్యర్థి తహసీన్‌ ఎన్నికయ్యారు. 29 ఓట్ల మెజారిటీతో ఆమె ఎన్నికయ్యారు. ఆమె 41 ఓట్లు, వైకాపా అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు వచ్చాయి. తహసీన్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్లుగా తెదేపా మద్దతు అభ్యర్థులు ఎన్నికయ్యారు. మొదటి వైస్‌ ఛైర్మన్‌గా 9వ వార్డుకు చెందిన ఎరటపల్లి శివకుమార్‌రెడ్డి, రెండో వైస్‌ఛైర్మన్‌గా 8వ వార్డుకు చెందిన పటాన్‌ నస్రిన్‌ ఎన్నికయ్యారు. పిడుగురాళ్ల మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా పడింది. కౌన్సిల్ సమావేశానికి వైకాపా కౌన్సిలర్లు రాకపోవడంతో ఎన్నికను ఆర్డీవో రేపటికి వాయిదా వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)