వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మీద చేసిన కామెంట్స్ పై మాజీ రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు. భయం అనేది తనలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నానని తెలిపారు. ఆ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దీనికి కౌంటర్ గా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ''రాష్ట్ర రాజకీయాల్లో విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉన్న నాయకుడు ఎవరన్నదీ ప్రజలందరికీ తెలుసు. ఆయనకు అవి ఉన్నాయి కాబట్టే, కనీస రాజకీయ నేపథ్యం లేకపోయినా ఆడిటర్ గా ఉన్న వ్యక్తి అన్ని హోదాలు, అన్ని పదవులు అనుభవించాడు. పార్టీలో గొప్ప గౌరవాన్ని పొందిన తర్వాత బయటకు వెళ్లి మీకేదో చెప్పాడని, దాన్ని మాట్లాడ్డం అంటే, వైయస్. కుటుంబం పరువును బజారుకు ఈడుస్తున్నది ఎవరో, ఇది ఎవరి కనుసన్నల్లో జరుగుతోందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు'' అంటూ వ్యాఖ్యానించారు.
ఎవరి కనుసన్నల్లో జరుగుతోందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు : కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
February 08, 2025
0
Tags