తెలంగాణ కేబినెట్ కులగణన, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. మూడు గ్రూపులుగా SC వర్గీకరణ చేశారని సమాచారం. తెలంగాణ కేబినెట్ సమావేశం రెండున్నర గంటలపాటు సాగింది. ఈ సందర్భంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. ఈ రోజు దేశం చరిత్రలో నిలిచిపోతుందని, ఈ నిర్ణయంతో ప్రధాని పై ఒత్తిడి పెరగనుందన్నారు. అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేయాలని డిమాండ్ రానుందని, 76 బీసీ, ఎస్సీ మైనార్టీలకు న్యాయం జరగనుందని వివరించారు. భవిష్యత్ లో ఈ రోజు మేము ప్రవేశపెట్టే డాక్యుమెంట్ రిఫరెన్స్ తీసుకోవాలని తెలిపారు. 2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ మేమే చేశామని 2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్లే చెప్పాలన్నారు. ఏ గ్రూప్ – ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలు, సంచార కులాలు- 1%, బి గ్రూప్ – మాదిగ, మాదిగ ఉప కులాలు – 9%, సి గ్రూప్ –మాల మాల ఉపకులాలు -5%
తెలంగాణతో మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణకు కేబినేట్ ఆమోదం !
February 04, 2025
0
Tags