శేఖర్ బాషాపై కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఫిర్యాదు !

Telugu Lo Computer
0


బిగ్ బాస్ ఫేమ్ RJ శేఖర్ బాషా పై నార్సింగి పీస్ లో మరో కేసు నమోదు అయింది. శేఖర్ బాషా పై కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఫిర్యాదు చేశారు. గతంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కూడా షష్టి వర్మ ఫిర్యాదు చేశారు. తన పరువుకు భంగం వాటిల్లేలా , కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మాట్లాడుతున్నాడని షష్టి వర్మ ఫిర్యాదు చేశారు. ఉద్దేశ పూర్వకంగా మరియు దురుద్దేశం తో ప్రయివేటు కాల్ రికార్డ్ లు లీక్ చేశాడని ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. శేఖర్ బాషా వ్యక్తిగత మొబైల్ తోపాటు, అతనితో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజస్ లు సీజ్ చేయాలని బాధితురాలు కోరారు. ఈ తరుణంలోనే బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 79 ,67, ఐటీ యాక్ట్ 72 కింద శేఖర్ బాషా పై కేసు నమోదు అయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)