ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ లో తన నివాసం నుంచి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2.55 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5.10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 5.50 గంటలకు 1 జన్ పథ్ నివాసానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని సహద్ర ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పయనం !
February 02, 2025
0
Tags