యాదాద్రి భువనగిరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని కోళ్ల ఫారంలో సుమారు 500 కోళ్లు మృతి చెందాయి. గత పది రోజులుగా బర్డ్ ఫ్లూ వ్యాధితో సతమతమవుతున్న కోళ్ల ఫారం యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కలకలం లేపుతున్న ఈ బర్డ్స్ ఫ్లూ వ్యాధిని అరికట్టడానికి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. చికెన్ వ్యాపారులు అమ్మడం కానీ, కొనుగోలు చేయకూడదని జీవో కూడా జారీ చేసింది. ఇందులో భాగంగా ఈరోజు చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో కోళ్లు మృతి చెందడంతో యజమాని వెంటనే వాటిని పాతిపెట్టాడు. తమకు భారీగా నష్టం వచ్చిందని కోళ్ల ఫారం యజమాని వాపోతున్నాడు. ఈ వ్యాధి జంతువుల నుండి మనుషులకి సంక్రమించినప్పుడు మనుషుల్లో గొంతు నొప్పి, శ్వాసకోశ వ్యాధులు, కళ్ళు ఎర్రబారడం లక్షణాలు బయటికి కనబడతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇంతవరకు ఈ వైరస్ కి మందు అనేది కనిపెట్టలేదని నల్గొండ జిల్లాలోని నకిరేకల్ పట్టణం చెందిన పశువైద్యుల డాక్టర్ కిరణ్ తెలిపారు. ఈ వైరస్ తెలంగాణకు రాకపోవడానికి చాలా ఆనందకరమైన విషయం అని అన్నారు. పౌల్ట్రీ దగ్గరికి వెళ్లి రైతులకు బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తున్నామని. ఈ వ్యాధి సోకిన వాటిని చెత్తకుప్పల్లో, జన ఆవాస ప్రదేశాలలో వేయకూడదని తెలిపారు. ఈ వైరస్ బారిన పడిన జంతువులు కళ్లద్వారా స్లేష్మం కారుతుంది, వాటి ద్వారా ఇతర జంతువులకే, మానవులకి సంభవిస్తుందని తెలియజేశారు. ఈ వైరస్ కు మందు లేకపోవడంతో నివారణ ఒక్కటే చర్య అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కోదాడ నాగార్జునసాగర్ వాడపల్లి దగ్గర పశువైద్య సిబ్బంది పోలీసుల ఆధ్వర్యంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన కోళ్ల వాహనాలను తిరిగి పంపిస్తున్న అధికారులు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 80 లక్షల కోళ్లు పెరుగుతున్నాయి. పెరుగుదలలో మొదటి స్థానంలో యాదాద్రి, సూర్యాపేట ఉండగా మూడో స్థానంలో నల్గొండ జిల్లా ఉన్నది. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు రైతులను, పౌల్ట్రీలు సందర్శించి తగిన సూచనలు తెలియజేస్తున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ అనేది జంతువులలో అధికంగా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా కోళ్లలో అధికంగా వస్తుంది. వ్యాధి సోకిన జంతువులు మలం ద్వారా గాని, లాలాజలం ద్వారా గాని మరొక జంతువుకు సంక్రమిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)