ఆంధ్రప్రదేశ్ లో మసీదులలో ఇమామ్, మౌజన్ ల పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024 ఏప్రిల్ నుండి వీరికి అందించే గౌరవ వేతనాలు అందలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, తమ ప్రభుత్వం కూడా ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనాలు అందించే ప్రక్రియను కొనసాగిస్తుందని ప్రకటించింది. రంజాన్ మాసం వస్తున్న సందర్భంగా ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 వరకు పెండింగ్ లో వున్న రూ. 45 కోట్లల్లో వేతనాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో ఇమామ్ లకు నెలకు రూ. 10 వేల చొప్పున, మౌజన్ లకు రూ. 5 వేల చొప్పున వేతనాలు చెల్లిస్తారు. ప్రభుత్వం పెండింగ్ వేతనాలు మంజూరు చేయడంపై ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తుందని మంత్రి మహమ్మద్ ఫరూఖ్ అన్నారు. కాగా మార్చి 2 నుండి 30 వ తేదీ వరకు రంజాన్ మాసం సంధర్భంగా ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గంట సమయం వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. ముస్లింలు ఉపవాసం ఆచరిస్తారు కావున ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులను కూడా విడుదల చేసింది. రంజాన్ మాసంలో ఉపవాసాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమని ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఇమామ్, మౌజన్ ల పెండింగ్ వేతనాలు విడుదల
February 18, 2025
0
Tags