పోసాని కృష్ణ మురళి అరెస్టు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ కి చెందిన పోలీసులు నటుడు పోసాని కృష్ణ మురళిని హైదరాబాద్ రాయదుర్గం హైహోం భుజా అపార్ట్‌మెంట్స్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లను ఉద్దేశించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై నమోదైన కేసులకు సంబంధించే రాయచోటి పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. రాయదుర్గం పోలీసులకు పోసాని అరెస్ట్‌కు సంబంధించిన సమాచారం అందించిన తర్వాత ఆయనను రాయచోటికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసే సమయంలో పోసాని కృష్ణమురళికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి ఎలా వస్తారంటూ పోలీసులను ప్రశ్నించారు నటుడు పోసాని. కేసు ఉన్న సమయంలో ఎక్కడికి వచ్చి అయినా అరెస్ట్ చేసే అధికారం తమకుందంటూ సదరు అధికారి సమాధానం ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)