మహారాష్ట్రలోని మూర్తాజాపుర్ కు చెందిన వధువుకు అదే ప్రాంతానికి చెందిన వరుడితో వివాహం కుదిరింది. ఇద్దరి కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. అయితే ఇరు కుటుంబాల సభ్యులంతా ఒకే దగ్గర కూర్చుని ఒకరికొకరు తెలుసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో వధువు అంకుల్ వరుడి సిబిల్ స్కోర్ చూడాలని పట్టుబట్టాడు. ఆ తర్వాత వరుడి సిబిల్ స్కోర్ చూసి షాక్ అయ్యాడు. అతడు ఇప్పటికే అనేక బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు వధువు అంకుల్ గుర్తించాడు. సిబిల్ స్కోర్ కూడా చాలా తక్కువ ఉండటం వల్ల పెళ్లి రద్దు చేశాడు. అప్పుల్లో కూరుకుపోయిన వరుడు, తమ కుమార్తెకు ఆర్థిక భరోసాను ఎలా కలిగిస్తాడని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని పెళ్లి రద్దు ?
February 08, 2025
0
Tags