చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను కలిసిన కాంగ్రెస్ నేత సీనియర్ వి.హనుమంతరావు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్‌లను తెలంగాణ కాంగ్రెస్ నేత సీనియర్ వి.హనుమంతరావు కలిశారు. జనగణన కుల ప్రాతిపదికన జరగాలని కోరారు. అలాగే కుల ప్రాతిపదికన జనగణనపైన మోడీతో చర్చించాలని పవన్ కళ్యాణ్‌ని హనుమంతరావు కోరారు. తెలంగాణ సీఎంరేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణలో జనగణన ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌లను కుల ప్రాతిపదికన జనగణన చేయాలని కోరడానికి కలిశానని తెలిపారు. బీసీలకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని అడిగానన్నారు. కర్నూలు దగ్గర పెదపాడు గ్రామానికి దామోదర సంజీవయ్య పేరు పెట్టాలి. ఆ ప్రాంతంలో స్మృతి వనం కట్టాలని వీహెచ్ పేర్కొన్నారు. అందుకోసం పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం ఇచ్చారని తెలిపారు. నీతి నిజాయితీ కలిగిన సంజీవయ్య చనిపోయినప్పుడు కూడా సొంత ఇల్లు లేదని అన్నారు. ఆయనకి న్యాయం జరగాలని వి.హనుమంతరావు కోరారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)