సీనియర్‌ నటి పుష్పలత కన్నుమూత

Telugu Lo Computer
0


సీనియర్‌ నటి పుష్పలత ఆమె వృద్ధాప్యం కారణంగా చెన్నైలో కన్నుమూశారు. తమిళనాడు కోయంబత్తూర్‌లోని మేటుపాలయానికి చెందిన ఈమె, తొమ్మిదవ ఏటనే భరతనాట్యంలో శిక్షణ పొంది, నటుడు ఎస్సే నటరాజ్‌ దర్శకత్వం వహించి, నిర్మించిన 'నల్ల తంగై' (1955) అనే తమిళ చిత్రం ద్వారా నటిగా ఆరంగేట్రం చేశారు. 'కొంగు నాట్టు తంగం' (1962) సినిమాతో కథానాయకగా పరిచయమయ్యారు. ఆ తర్వాత హీరోయిన్‌గా, క్యారెస్ట్ ఆర్టిస్టుగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. తమిళంలో శారద, పార్‌ మగళే పార్, నానుమ్‌ ఒరు పెన్‌ సంతానం, కర్పూరం, జీవనాంశం, దర్శనం, కళ్యాణ రామన్, సకల కళావల్లభన్, సిమ్లా స్పెషల్‌' వంటి పలు విజయవంతమైన చిత్రాలు చేశారు. ఎన్టీఆర్‌ హీరోగా కోవెలమూడి భాస్కర్‌ రావ్‌ దర్శకత్వంలో రూపొందిన 'చెరపకురా.. చెడేవు!' అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. 'ఆడబిడ్డ, మా ఊరిలో మహాశివుడు, వేటగాడు, ఆటగాడు, ఘరానా దొంగ, రక్త బంధం, శూలం, కొండవీటి సింహం, ఇద్దరు కొడుకులు, ప్రతిజ్ఞ, మూగవాని పగ, ఉక్కుమనిషి, రంగూన్‌ రౌడీ, విక్రమ్‌' వంటి చిత్రాలలో నటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)