సెల్ ఫోన్ మీద, ఇంటర్నెట్ లో సెర్చ్ ఇంజన్ల మీద ఆధారపడడం వల్ల మన మెదడు ఆరోగ్యం, చురుకుదనాన్ని కోల్పోతుంది. జీవన శైలిలో మార్పులు, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటి అనేక కారణాలు మన మెదడు ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మెదడును చురుకుగా ఉంచే కొన్ని అలవాట్లను నేర్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉదయపు అలవాట్లు జీవన శైలిలో వ్యక్తి జీవితం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు. శరీరం రోజంతా ఎలా ఉండాలి అనేది మనం ఉదయం చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. నిద్ర లేవడానికి రోజు ఒకే సమయాన్ని పాటిస్తే మెదడు చురుగ్గా ఉంటుంది. ప్రతిరోజు రాత్రి త్వరగా పడుకోవడం, ఉదయం త్వరగా మేలుకోవడం చేస్తే మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. మెదడు యాక్టివ్ గా ఉండాలంటే నిద్రలేచిన తర్వాత ఒక గ్లాసు నీళ్లతో రోజును ప్రారంభించాలి. నిద్రలేచిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగి ఆ రోజును ప్రారంభిస్తే మెదడు యాక్టివ్ గా ఉంటుంది. నిద్రలేచిన తర్వాత శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మెదడుకు రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. మనం రోజంతా ఉత్సాహంగా ఉండటం కోసం ఈ చర్య ఎంతగానో దోహదం చేస్తుంది. ఇక మెదడు చురుగ్గా ఉండాలంటే ప్రతిరోజు వారు పూర్తి చేయాల్సిన పనుల లక్ష్యాలను నిర్దేశించుకుని పనుల జాబితాను తయారు చేసుకోవాలి. సానుకూల ధోరణితో ఆ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఉదయం పూట పాజిటివ్ గా ఉండే విధంగా ఒక పదిహేను నిమిషాల పాటు మెదడుకు పదును పెట్టాలి. చదవడం పజిల్స్ పూరించడం వంటివి చెయ్యాలి. మెదడు చురుగ్గా పనిచేయాలంటే శరీరానికి ధ్యానం కూడా అవసరం. ఒత్తిడిని తగ్గించి భావోద్వేగాలను కంట్రోల్ చేసే ధ్యానంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇక మెదడు చురుగ్గా పనిచేయాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా అల్పాహారం తాజా పండ్లు తృణధాన్యాలు గుడ్లు నట్స్ వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇక సూర్యరశ్మికి ఉదయాన్నే కాసేపు నడవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి అందుతుంది. దీనివల్ల మెదడు కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఇక వ్యాయామం చేయడం, యోగ చేయటం, ఆటలు ఆడటం వంటి వాటితో శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది.
మెదడును చురుకుగా ఉంచే కొన్ని అలవాట్లు !
February 01, 2025
0
Tags