సోనూసూద్‌ ఫౌండేషన్‌ తరఫున నాలుగు అంబులెన్స్‌లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిజేత !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నటుడు, 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' వ్యవస్థాపకుడు సోనూసూద్‌ సోమవారం అమరావతిలోని సచివాలయంలో కలిసి సోనూసూద్‌ ఫౌండేషన్‌ తరఫున నాలుగు అంబులెన్స్‌లను అందించారు.  అనంతరం నాలుగు అంబులెన్స్‌లను సీఎం ప్రారంభించారు. మర్యాద పూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్‌ను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో 'సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌' భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)