తమిళనాడులో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో స్టాలిన్ నిరాకరించడంపై ఇటీవల కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో బలవంతంగా దీనిని అమలు చేస్తోందని స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రం హిందీని తమపై రుద్దుతోందని వ్యాఖ్యానించగా, ఈ ఆరోపణను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో కొత్త విద్యా విధానం విషయంలో కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం క్రమంగా పెరుగుతోంది. ఈ వివాదం నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో కీలక ప్రకటన చేశారు. తమ రాష్ట్రం మరో భాషా యుద్ధానికి సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యను రాజకీయం చేస్తోందని, రాష్ట్రానికి రావాల్సిన కీలకమైన నిధులను నిలిపివేస్తోందని స్టాలిన్ ఆరోపించారు. ఈ క్రమంలో తమిళనాడులో కొత్త విద్యా విధానాన్ని స్టాలిన్‌తో పాటు కాంగ్రెస్, వామపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. రెండు వేల కోట్ల రూపాయల కోసం మన హక్కులను వదులుకోలేమని స్టాలిన్ ఈ సందర్భంగా అన్నారు. మనం అలా చేస్తే, తమిళ పాలన 2000 సంవత్సరాల వెనక్కి వెళుతుందన్నారు. కొత్త విద్యా విధానం సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తుందని, తమిళ భాషకు ప్రమాదం వాటిళ్లేలా చేస్తుందన్నారు. ఇది మన పిల్లల భవిష్యత్తుకు ప్రత్యక్ష ముప్పును కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మేము ఏ భాషను వ్యతిరేకించడం లేదని, కానీ తమపై ఏదైనా భాషను రుద్దితే ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు.
మేము ఏ భాషను వ్యతిరేకించడం లేదు - తమపై ఏదైనా భాషను రుద్దితే వ్యతిరేకిస్తాం : ఎంకే స్టాలిన్
February 25, 2025
0
Tags