విశాఖపట్నంలోని విశాలాక్షినగర్ ప్రాంతంలో కొందరి వద్ద మాదకద్రవ్యాలు ఉన్నట్టు టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఆరిలోవ పోలీసులతో కలిసి దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలిల ప్రకారం విశాలాక్షి నగర్ ప్రాంతంలో ఉన్న ఒడిశాకు చెందిన ముగ్గురు వద్ద డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో దాడి చేసి మహ్మద్ చాంద్‌బాబు, షేక్ అనీష్, షేక్ ముజఫర్ అనే వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వారి నుంచి రెండు గ్రాముల బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వీరు ఒడిశాలో అరబ్ అనే వ్యక్తి నుంచి బ్రౌన్ షుగర్ కొనుగోలు చేసి, ఈ ప్రాంతంలో విక్రయానికి తెచ్చినట్టు సీఐ తెలిపారు. వీరిని పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని, అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.
విశాఖపట్నంలో బ్రౌన్ షుగర్ స్వాధీనం !
February 15, 2025
0
Tags