కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మోకాలి నొప్పి కారణంగా బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకుంటోన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం నిర్ధారించింది. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారని తెలిపింది. గతంలో సిద్ధరామయ్య ఎడమ మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఆ నొప్పి ఇప్పుడు తిరగబెట్టింది. మోకాలి లిగమెంట్ సర్జరీ జరిగిన చోట ఒత్తిడి పడటం వల్ల గాయం రేగింది. ఫలితంగా- నడవడానికి ఇబ్బంది పడ్డారు. అధికారిక నివాసంలో డాక్టర్లు ఆయనకు పరీక్షలను నిర్వహించారు. వారి సూచనల మేరకు మణిపాల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆసుపత్రిలో సిద్ధరామయ్యకు వైద్య పరీక్షలను నిర్వహించారు. లిగమెంట్ సర్జరీ మీద ఒత్తిడి పడటం వల్ల నొప్పి తీవ్రమైనట్లు వెల్లడించారు. ఆయనకు మరే ఇతర అనారోగ్య సమస్యలు లేవని, రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య పాల్గొనాల్సి ఉన్న అన్ని అధికారిక కార్యక్రమాలను కూడా రద్దయ్యాయి. ఈ రెండు రోజుల్లో సిద్ధరామయ్య పాల్గొనాల్సిన కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలు, జిల్లా పర్యటనలను రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. రెండు రోజుల పాటు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారని పేర్కొంది.
సిద్ధరామయ్య ఎడమ మోకాలికి శస్త్ర చికిత్స !
February 02, 2025
0
Tags