ఫ్లిప్‌కార్ట్ పోకో ఎం6 5జీ పై 29 శాతం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్, ఈఎమ్ఐ, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. పోకో ఎం6 5జీ మొబైల్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే 600 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ కలిగి ఉంటుంది. ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ 6100+ ప్రాసెసర్‌లో ఆండ్రాయిడ్ 13 ఆధారంగా MIUI 14 OSపై పని చేస్తుంది. గ్రాఫిక్స్ కోసం, ఫోన్‌లో ఆర్మ్ మాలి G57 MC2 GPU కూడా ఉంది. ఈ ఫోన్‌లో 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్ ఉంది. ఫోన్ ర్యామ్ పెంచడానికి టర్బో ఫీచర్ అందించారు. ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, AI సెకండరీ కెమెరా, వీడియో కాలింగ్ కోసం 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. పవర్ కోసం 5000mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. ఇందులో డ్యూయల్ సిమ్ 5G, 4G, బ్లూటూత్, Wi-Fi, అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎం6 5జీ పై డిస్కౌంట్ ఆఫర్ !
February 06, 2025
0
Tags