ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు విస్తరించేందుకు సన్నద్ధమైంది. దేశవ్యాప్తంగా హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ డివైజులు, వైఫై సొల్యూషన్స్ సరఫరా కోసం నోకియా, క్వాల్‌కామ్‌తో జట్టుకట్టింది. ఈ డివైజులు భారత్‌లోనే తయారు కానున్నాయని కంపెనీ ఓ ప్రకటనలో బుధవారం తెలిపింది. అయితే, కాంట్రాక్టుకు సంబంధించిన వివరాలు మాత్రం కంపెనీ వెల్లడించలేదు. దేశీయంగా బ్రాండ్‌బ్యాండ్ వినియోగం పెరుగుతోంది. అదే స్థాయిలో ఫైబర్ కనెక్టివిటీ విస్తరించడం లేదు. దీంతో జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు ఎయిర్‌ఫైబర్ సేవలకు శ్రీకారం చుట్టాయి. ఫైబర్‌నెట్ విస్తరించని ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు ఈ ఎయిర్‌ఫైబర్ సేవలు ఉపయోపడతాయి. దీన్ని మరింత వేగంగా విస్తరించేందుకు ఈ డీల్ ఎయిర్‌టెల్‌కు ఉపయోగపడనుంది. కాంట్రాక్టులో భాగంగా ఫిక్స్‌డ్ వైర్‌లైన్ యాక్సెస్ ఔట్‌డోర్ రిసీవర్లు, వైఫై 6 యాక్సెస్ పాయింట్లను నోకియా సరఫరా చేయనుంది. నోకియా అందించే ఫాస్ట్‌మైల్ 5జీ ఔట్‌డోర్ రిసీవర్లకు ఒకటి కంటే ఎక్కువ యూనిట్లను కనెక్ట్ చేయొచ్చు. అంటే రెండిళ్లకు ఒకే యూనిట్ అమర్చొచ్చు. దీనివల్ల కంపెనీకి ఖర్చులు సైతం తగ్గనున్నాయి. అలాగే, ఈ యూనిట్లు పవర్-ఓవర్- ఈథర్‌నెట్ టెక్నాలజీ సాయంతో పనిచేస్తాయి. దీని కోసం ప్రత్యేకంగా పవర్ సప్లయ్ అవసరం లేదు. లోపల వైఫై యాక్సెస్ పాయింట్లను వచ్చే పవర్‌తో ఇవి పనిచేస్తాయి. దీనివల్ల గోడలు, బాల్కనీ, స్తంభాలు.. ఇలా ఎక్కడైనా వీటిని అమర్చొచ్చు. ఇంటి లోపల భాగంలో నోకియా వైఫై 6 యాక్సెస్ పాయింట్లను అమర్చుతారు. ఇవి పూర్తిగా రీసైకిల్ చేయడానికి వీలుండే మెటీరియల్‌తో రూపొందుతాయని కంపెనీ వెల్లడించింది.
5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ డివైజులు, వైఫై సొల్యూషన్స్ సరఫరా కోసం నోకియాతో జట్టుకట్టిన ఎయిర్‌టెల్ !
February 12, 2025
0
Tags