తెలంగాణలోని ముగ్గురు ఐపీఎస్‌ అధికారులకు 24 గంటల్లోగా ఏపీలో రిపోర్ట్‌ చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ !

Telugu Lo Computer
0


తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్‌లను  ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి రిలీవ్‌ చేస్తూ 24 గంటల్లోగా ఏపీలో రిపోర్ట్‌ చేయాలని  కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిని వెంటనే రిలీవ్‌ చేయాలని హోం శాఖ ఆదేశాలిచ్చింది. డీజీ అంజనీ కుమార్‌ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన తెలంగాణ డీజీపీగా కూడా గతంలో పనిచేశారు. అభిషేక్‌ మహంతి ప్రస్తుతం కరీంనగర్ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అభిలాష బిస్త్త్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంజనీ కుమార్‌, అభిలాష బిస్త్‌ డీజీ ర్యాంక్‌లో ఉండగా, అభిషేక్‌ మహంతి ఎస్పీ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. అయితే ఈ ఆదేశాలపై ఐపీఎస్‌లు కొంత సమయం కావాలని కోరే అవకాశం ఉంది. మూడు నెలల క్రితం ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను ఇలాగే బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఈ ముగ్గురు ఐపీఎస్‌లకు షాక్‌ ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి వీళ్లు ఇక్కడే ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఈ ముగ్గురిని కూడా కేంద్రం ఏపీకి అలాట్‌ చేసింది. కానీ, ఆ నిర్ణయాన్ని వీరు ముగ్గురు సవాల్‌ చేస్తూ క్యాట్‌ని ఆశ్రయించారు. అక్కడ వీరి అలాట్‌మెంట్‌కు సంబంధించిన వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)