వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా సంక్షేమం – సంస్కరణల సమపాళ్లలో కేంద్ర బడ్జెట్ : పవన్ కళ్యాణ్

Telugu Lo Computer
0


వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా సంక్షేమం – సంస్కరణల సమపాళ్లలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆదాయపు పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచడం పట్ల మధ్య తరగతికి ఎంతో ఊరట కలిగిస్తుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కి ఇప్పటికే మూడు లక్షల కోట్లు అభివృద్ధి కోసం నిధులు కేటాయించిన ఎన్డీఏ ప్రభుత్వం, బడ్జెట్ లో అమరావతి, పోలవరం నిర్మాణాలకు నిధులు కేటాయించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని తెలిపారు.  కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ రూ. 5,936 కోట్లు. పోలవరం ప్రాజెక్టు బ్యాలెన్స్ గ్రాంట్ రూ. 12,157 కోట్లు. విశాఖ పోర్ట్ రూ. 730 కోట్లు. విశాఖ స్టీల్ ప్లాంట్ 3,295 కోట్లు. రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి 240 కోట్లు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ 186 కోట్లు. లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ 375 కోట్లు. ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు. ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండవ దశకు 242.50 కోట్లు కేటాయించింది. .

Post a Comment

0Comments

Post a Comment (0)