ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతకు ప్రైజ్‌మనీ 20.8 కోట్లు !

Telugu Lo Computer
0


ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్ ఆతిథ్యాన ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.  దీనిలో ఎనిమిది టీమ్‌లు ఉన్నాయి. భారత్ ఆడనున్న మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ2025కి  ప్రైజ్ మనీని తాజాగా ఐసీసీ ప్రకటించింది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరిసారిగా 2017లో జరిగింది. ఈ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌పై పాకిస్థాన్ గెలిచింది. అప్పుడు గెలిచిన జట్టుకు దాదాపు రూ.14.18 కోట్లను ప్రైజ్ మనీగా ఐసీసీ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం గతంతో పోలిస్తే దాదాపు 53 శాతం ప్రైజ్ మనీని ఐసీసీ పెంచింది. రూ.60 కోట్ల ప్రైజ్ మనీని జట్టులకు పంచనుంది. లాస్ట్ ప్లేస్‌లో నిలిచిన జట్టుకూ ప్రైజ్ మనీ ఇవ్వనుంది. దానికి రూ.1.22 కోట్లు దక్కనుంది. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కో మ్యాచ్‌కు దాదాపు రూ.29 లక్షలు ఎక్స్‌ట్రాగా పంచనుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)