1,380 ఈవీ6 కార్లను రీకాల్ చేసిన కియా ?

Telugu Lo Computer
0


కియా ఇండియా ఎలక్ట్రిక్ కారు ఈవీ6 1,380 యూనిట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ యూనిట్లను 3 మార్చి 2022, 14 ఏప్రిల్ 2023 మధ్య తయారు చేసిన కార్లను రికాల్ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకి సమాచారం అందించింది. ప్రస్తుతం కస్టమర్లను సంప్రదిస్తోంది. రీకాల్ చేయడానికి కారణాన్ని కంపెనీ వెల్లడించింది. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ సాఫ్ట్‌వేర్‌ను నవీకరించనుంది. ఇది 12V సపోర్టు బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్, పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ రీకాల్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ సామర్థ్యాన్ని పెంచేందుకు కంపెనీ యత్నిస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)