ఆంధ్రప్రదేశ్ కి చెందిన మహిళ (32) భర్తతో విడిపోయి మణికొండలో హౌస్ కీపింగ్ చేస్తూ 15 రోజుల క్రితమే అమీర్‌పేట్‌లో ఒక హాస్టల్‌లో జాయిన్ అయ్యింది. సినిమాలంటే ఆ మహిళకు ఇష్టం కావడంతో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేరడానికి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకుంది. ఇదే క్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన కాటేకొండ రాజుతో పరిచయం ఏర్పడింది. మూడు రోజుల క్రితం ఆడిషన్స్ ఉన్నాయంటూ కృష్ణానగర్‌లోని హెవెన్ హోటల్‌కు ఆమెను పిలిపించాడు కాటేకొండ రాజు. మొదటి రోజు ఫోటోషూట్ చేసి మరుసటి రోజు మళ్లీ అదే చోటికి రావాలని చెప్పి ఆ మహిళను అక్కడి నుండి పంపించేశాడు. అది నమ్మి రెండో రోజు కూడా అదే హోటలర్ రూమ్‌కు వెళ్లింది ఆ మహిళ. ఆ సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బీ ఎన్ ఎస్ 64,79,115,351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సినిమాల్లో ఒక్క ఛాన్స్ ఇప్పిస్తానని మహిళపై అసిస్టెంట్ డైరెక్టర్ లైంగిక దాడి !
January 18, 2025
0
Tags