ఇంటి పైకప్పు మీద పడిన శాటిలైట్ పేలోడ్ బెలూన్ !

Telugu Lo Computer
0


ర్ణాటకలోని బీదర్ జిల్లా జలసంగి గ్రామంలో ఓ ఇంటిపై తెల్లవారుజామున నింగిలో నుంచి శాటిలైట్ పేలోడ్ బెలూన్ పడింది. అందులో ఓ భారీ మెషీన్ ఉండటం, అలాగే రెడ్ లైట్ ఒకటి వెలుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఆ బెలూన్‌ను టాటా ఇన్సిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, హైదరాబాద్ నింగిలోకి వదిలినట్టు తెలిసింది. అందులో ఉన్న లెటర్ ద్వారా ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఆ బెలూన్‌ను వాతావరణంపై అధ్యయనం కోసం విడుదల చేసినట్టు తెలుస్తోంది. దాని కారణంగా ఎలాంటి డ్యామేజ్ జరగలేదని స్థానిక పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం మేరకు టాటా రీసెర్చ్ సెంటర్ సైంటిస్టులు ఆ బెలూన్‌లోని డేటా సేకరించేందుకు సంఘటనా స్థలానికి బయల్దేరారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)