దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన నేపథ్యంలో శనివారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదని అన్నారు. తెలంగాణలో గోదావరి నదిపై కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే తాము అభ్యంతరం చెప్పలేదని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశ అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. దావోస్ లో మొత్తం 27 సమావేశాలలో పాల్గొన్నామని తెలిపారు. తాను 1995 నుండి దావోస్ కి వెళ్లడం ప్రారంభించానని, మొదట్లో ఏ హైదరాబాద్ అని అడిగారన్నారు. అలాగే వైసిపి కేంద్ర కమిటీ కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా అంశంపై కూడా స్పందించారు. విజయసాయిరెడ్డి రాజీనామా పార్టీ అంతర్గత వ్యవహారమని అన్నారు. పార్టీపై నమ్మకం ఉంటే ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారని వ్యాఖ్యానించారు.
బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు : చంద్రబాబు
January 25, 2025
0
Tags