ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో భార్య వేధింపులు తాళలేక న్యాయవాది సమీర్ మెహెందిర్తా (45) తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు ముందు భార్యతో విడాకులకు సంబంధించిన ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 45 ఏళ్ల సమీర్ మెహెందిర్తా అనే న్యాయవాది ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో న్యాయవాద వృత్తిని చేస్తున్నారు. భార్యాభర్తలు విడివిడిగా జీవిస్తున్నారు. అయితే భార్యతో విడాకులకు సంబంధించిన గొడవ జరిగింది. దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బెదిరించాడు. భార్యతో చాటింగ్ చేస్తుండగా బుధవారం మధ్యాహ్నం సమీర్ తుపాకీ తీసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తుపాకీతో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య !
January 09, 2025
0
Tags