ఆటగాళ్లకు పది పాయింట్లతో కూడిన పాలసీని జారీ చేసిన బీసీసీఐ !

Telugu Lo Computer
0


బీసీసీఐ పది పాయింట్లతో కూడిన పాలసీని జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే ఐపీఎల్ నిషేధం వంటి అంశాలను తీసుకురానున్నారు. 

* ఏదైనా సిరీస్ జరుగుతున్న లేదా జట్టు విదేశీ పర్యటనలో ఉన్నా ఆ సమయంలో ఆటగాళ్లకు వ్యక్తిగత ప్రకటన షూట్‌లు చేయడానికి లేదా స్పాన్సర్‌లతో పని చేయడానికి స్వేచ్ఛ ఉండదు.

* ఇతర దేశాల్లో ఏదైనా సిరీస్ 45 రోజులకు మించి పర్యటన ఉంటే కుటుంబాలకు కేవలం రెండు వారాల సమయం మాత్రం ఇవ్వనుంది. తక్కువ వ్యవధి గల సిరీస్ లో కేవలం వారం రోజులు మాత్రమే కేటాయించనుంది.

*  ఏ సిరీస్‌కైనా వ్యక్తిగతంగా కాకుండా జట్టుతో పాటే కలిసి ప్రయాణించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆటగాళ్ల మధ్య అనుబంధం కలుగుతుంది. ఫ్యామిలీతో ప్రయాణించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి తీసుకోవాలి.

*  ప్రతి క్రికెటర్ జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే దేశీవాళీ పోటీల్లో ఆడాల్సిందే. కుర్రాళ్లతో పాటు సీనియర్లకూ ఈ నిబంధన వర్తిస్తుంది. సరైన కారణం చూపితే మినహాయింపు ఇస్తారు.

*  జట్టులోని ఎవరైనా సరే బోర్డు అనుమతి లేకుండా వ్యక్తిగత సిబ్బందిని వెంట తీసుకెళ్లడం కుదరదు.

*  గతంలో ఎంత లగేజీని వెంట తీసుకెళ్లినా దానికి బీసీసీఐ రుసుం చెల్లించేంది. ఇక నుంచి 150 కేజీల వరకు మాత్రమే అనుమతి ఇవ్వనుంది. అంతకుమించితే ప్లేయర్లే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

*  ప్రాక్టీస్ చేసేందుకు జట్టులోని ప్రతి క్రికెటర్ రావాలి. సహచర క్రికెటర్లతో కలిసి ఒకే బస్సులో ప్రయాణించాలి.

*  బీసీసీఐ నిర్వహించే మీటింగ్‌లు, కార్యక్రమాలకు అందరూ అందుబాటులో ఉండాలి.

*  ఏదైనా పర్యటనలో సిరీస్ లేదా మ్యాచ్ ముగిసిన వెంటనే కొందరు వ్యక్తిగతంగా వెళ్లిపోతున్నారు.ఇక నుంచి జట్టుతోపాటే వెళ్లాలి. అందరూ కలిసే ప్రయాణించాలి.

*  ఇప్పటివరకు స్టార్ క్రికెటర్లకు వ్యక్తిగత రూమ్‌లు ఇచ్చేవారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉండేవారు. ఇకపై సహచర ప్లేయర్లతో కలిసి రూమ్ ను పంచుకోవాలి. ఫ్యామిలీ వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేకంగా ఉండేందుకు అనుమతి వస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)