ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంచు మోహన్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు యూనివర్సిటీ లోపల ఉండగా, రెండో కుమారుడు మంచు మనోజ్ యూనివర్సిటీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మనోజ్‌ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. తాను గొడవ కోసం రాలేదని, యూనివర్సిటీ ఆవరణలో తన తాత నారాయణస్వామి నాయుడు, నానమ్మ లక్ష్మమ్మల సమాధుల వద్ద నివాళులర్పించేందుకు మాత్రమే వచ్చానని మనోజ్ చెప్పినప్పటికీ, సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు. ఈ వ్యవహారంపై మనోజ్ గేటు వద్ద ఆందోళనకు దిగారు. ఆ సమయంలో లోపల ఉన్న వ్యక్తిని ఉద్దేశించి, "ఓరేయ్ ఎలుగుబంటి, గేటు తీయ్!" అంటూ అరిచారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో మోహన్ బాబు బౌన్సర్లు, మనోజ్ బౌన్సర్లు వివాదానికి దిగారు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటుండంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. అనంతరం పోలీసుల సహాయంతో తన భార్యతో కలిసి నానమ్మ తాత సమాధులకు మనోజ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మనోజ్ 'ఫ్యామిలీలో గొడవలు, కాలేజీలోకి రానివ్వక పోవడం వంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి తెలియడం లేదన్నారు. ఈ సమస్యలకు పరిస్కారం ఉంటే బాగున్ను, కచ్చితంగా పరిస్కారం కనుకుంటా. విద్యార్థులు, స్థానికులు, ప్రైవేట్ హాస్టళ్లపై జరిగే అన్యాయాలపై ప్రశ్నిస్తే దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ఇంట్లోకి రానివ్వకపోవడం, మా అమ్మ పుట్టినరోజు నాడు నా ఇంట్లో జనరేటర్ లో చక్కర పోశారు. బ్రెయిన్ వాష్ చేసి ఏమీ తెలియని మా అమ్మ వద్ద సంతకం పెట్టించారు. నా అభిమానులు కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సైతం తొలగించే స్థితికి దిగజారారు. గొడవలు వద్దు అని అభిమానులకు చెప్పా.. మొదటి సారి తొలగించిన అనంతరం నేను వస్తున్న అని తెలిసి మళ్లీ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ రోజు పనిగట్టుకుని మళ్లీ పెట్టిన ఫ్లెక్సీలను ఓ ట్రాక్టర్ ద్వారా తొలగించారు. పోలీసుల లాఠీలను రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు. ట్రస్ట్ సభ్యులు భయట నుంచి రౌడీలను తీసుకొచ్చి గొడవ పడుతున్నారు. పోలీసుల మాట విని తగ్గి వెనక్కి వెళ్తున్న… ఆ బౌన్సర్లను చూసి కాదు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తా.. లోకల్ వాళ్ళు అన్నా… అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. భయట నుంచి వచ్చిన రౌడీలు గోడ దూకి పారిపోయారు' అంటూ మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత : పోలీసుల లాఠీఛార్జ్ !
January 15, 2025
0
Tags