రాజ్యాంగాన్ని బీఆర్ఎస్ అపహాస్యం చేస్తుంది !

Telugu Lo Computer
0


జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బి.ఆర్.ఎస్ వ్యవహరించిన తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలను బీఆర్ఎస్ అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అని పొన్నం ప్రభాకర్ అన్నారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన అంశం. అయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం శ్రద్ధతో పని చేస్తుంది. అలాగే మేయర్ పై అవిశ్వాసం పెట్టుకునే హక్కు అందరికీ ఉంది. ఆ అవిశ్వాసం ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. కానీ బడ్జెట్ ను అడ్డుకోవడం అంటే హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్టే. బడ్జెట్ సమావేశాలు అడ్డుకోవడం పై బిఆర్ఎస్ నాయకత్వం జవాబు చెప్పాలి. హైదరాబాద్ లో గత 10 ఏళ్లుగా తెలంగాణ ఏర్పడిన తరువాత జరగని అభివృద్ది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి దానిని నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో లేని అభివృద్ది హైదరాబాద్ నగరంలో ఇప్పుడు జరుగుతుంటే ఈర్షగా ఉందా అని ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)