లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో హాలివుడ్ నటి డాలీస్ కర్రీ సజీవదహనం!

Telugu Lo Computer
0


మెరికాలోని లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో హాలివుడ్ నటి డాలీస్ కర్రీ (95) సజీవ దహనం అయినట్టు బంధువులు సోషల్ మీడియాక వేదికగా తెలిపారు. ఇంట్లో కాలిపోయిన అవశేషాలను అధికారులు గుర్తించారు. ద్రిబ్లూస్ బ్రదర్స్, దిటెన్ కమాండ్ మెంట్స్, లేడీ సింగ్స్ దిబ్లూస్ పాత్రలకు రిటైర్డ్ హాలీవుడ్ నటి డాలీస్ కర్రీ పేరు ప్రఖ్యాతలు గడించారు. కార్చిచ్చు చెలరేగడంతో ఆమె తప్పించుకోలేకపోయారు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కాలిఫోర్నియాలోని అల్టాడెనాలోని ఆమె ఇంట్లో అవశేషాలు గుర్తించారు. డాలీస్ కర్రీ చివరిసారిగా జనవరి 07న సాయంత్రం కనిపించింది. ఆమె మనవరాలు డాలీస్ కెల్లీ.. ఆమెను ఇంటి దగ్గర దింపి వెళ్లింది. మరుసటి రోజు ఉదయం కెల్లీ.. డాలీస్ కర్రీని గుర్తించే ప్రయత్నం చేసింది. కానీ ఆచూకి లభించలేదు. చివరికీ తన అమ్మమ్మ చనిపోయిందని తాజాగా సోషల్ మీడియా వేదికగా కెల్లీ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)