అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. తాజారౌండ్‌లో కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. కార్యాచరణను సమర్థవంతంగా మార్చడంతో పాటు ఖర్చులను తగ్గించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అమెజాన్ కార్యకలాపాల సమర్థతను పెంచేందుకు ఉద్యోగుల తొలగింపు సహాయపడుతుందని కంపెనీ అభిప్రాయపడింది. లేఆఫ్స్‌కు గురైన ఉద్యోగులకు అవసరమైన సాయం చేస్తామని తెలిపింది. కాగా, అమెజాన్ సీఈఓగా ఆండీ జస్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంపెనీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా వరుసగా ఉద్యోగుల తొలగింపులను ప్రకటిస్తూనే ఉంది. సంస్థ వ్యయ తగ్గింపు చర్యల్లో భాగంగా 2022లో ఏకంగా 27,000 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే, తాజా రౌండ్‌లో ఎంత మందిపై ప్రభావం ఉంటుందన్నది మాత్రం తెలియరాలేదు.
అమెజాన్‌లో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు ?
January 30, 2025
0
Tags