మేము వీడింది కార్యాలయాన్నే కాని, పోరాటాన్ని కాదు : జో బైడెన్‌

Telugu Lo Computer
0


అమెరికా అధ్యక్షులుగా  ట్రంప్‌ బాధ్యతల స్వీకరణ అనంతరం జో బైడెన్ కాలిఫోర్నియాకు పయనమవుతూ  'మేము వీడింది కార్యాలయాన్నే కాని, పోరాటాన్ని కాదు' అని వ్యాఖ్యానించారు. అంతేకాక 'ఈరోజు ప్రారంభోపన్యాసం విన్నాం, మనం ఇంకా చేయాల్సింది చాలా ఉంది' అని పేర్కొన్నారు. అనంతరం బైడెన్ దంపతులు హెలికాఫ్టర్‌ ఎక్కి కాలిఫోర్నియాకు బయలుదేరారు. తాను రాజకీయాల నుంచి వైదొలగబోనని, ప్రజా జీవితంలో కొనసాగుతానని జో బైడెన్‌ గతంలో స్పష్టంచేశారు. సాధారణంగా అమెరికా అధ్యక్షులుగా పని చేసినవారు పదవి నుంచి వైదొలగగానే ప్రజా జీవితానికి దూరంగా ఉంటారు. కానీ బైడెన్‌ తాను అలా చేయనని పేర్కొనడం గమనార్హం. 

Post a Comment

0Comments

Post a Comment (0)