కాంగ్రెస్ ప్రభుత్వం ఎవ్వరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ ప్రభుత్వం ఎవ్వరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆనాటి కార్యక్రమాలను గొప్పలు చేశామని మంత్రులు చెబుతున్నారు. అప్పుడున్న అధికారులు వారే ఒప్పుకుంటున్నారు తప్పు జరిగిందని, వారు మంత్రులుగా ఉన్నప్పుడు ఇదే మాట చెప్పేవారు. వ్యక్తులను ఇబ్బంది పెట్టాలనో, తప్పుడు కేసులు బనాయించాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంది. ఒకరోజు ముందో ఆలస్యమో చట్టం ప్రకారమే ప్రభుత్వం చేస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)