విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కు అందించారు. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాలో మరోసారి సంచలన పోస్ట్ పెట్టారు. దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించి వారి దేశానికి పంపివేయాలని అన్నారు. చాలా మంది వ్యక్తులు మారిన పేర్లతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. అందులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ‘‘దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులు భద్రతకు పెద్ద ముప్పుగా మారడమే కాకుండా సామాజిక స్వరూపాన్ని కూడా దెబ్బతీస్తున్నారు. చాలా మంది వ్యక్తులు మారిన పేర్లతో జీవిస్తున్నారు. కొందరు నేరాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితి దేశ శాంతి భద్రతలకు పెను సవాలు. అటువంటి అక్రమ వలసదారులందరినీ గుర్తించి వీలైనంత త్వరగా వారి దేశానికి తిరిగి పంపించేందుకు ప్రచారాన్ని ప్రారంభించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దేశప్రజల భద్రత, జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీపడకూడదు’’ అని రాసుకొచ్చారు.
రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా !
January 25, 2025
0
Tags