కన్నౌజ్‌ రైల్వే స్టేషన్‌లో కూలిన భవనం పైకప్పు : శిథిలాల కింద చిక్కుకున్న కూలీలు

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు ప్రమాదవశాత్తూ కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద కనీసం 20 మంది చిక్కుకుని ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. ఇప్పటివరకు ఆరుగురిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్నౌజ్‌ రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనుల్లో భాగంగా పలు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం రెండో అంతస్తులో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)