దొంగే దొంగ....దొంగ... అని అరిచినట్లు ఉంది : మంత్రి దామోదర రాజనర్సింహ !

Telugu Lo Computer
0


పదేళ్లు  ఆరోగ్య శ్రీని నీరుగార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అదే పథకం గురించి మాట్లాడటం చూస్తుంటే దొంగే దొంగ....దొంగ... అని అరిచినట్టుగా ఉందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ న్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆసుపత్రిలకు డబ్బులు చెల్లించలేదని, ఫ్యాకేజీల ధరలు రివైజ్ చేయలేదని, సుమారు రూ.730 కోట్లు బాకీ పెట్టి పోయారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మిగిల్చిన అప్పులను, పెండింగ్ బిల్లుల సమస్యలను ఒక్కొక్కటిగా మేము పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. బీఆర్ఎస్ పెట్టిన పాత బకాయిలతో సహా రూ.1130 కోట్లు ఏడాదిలో చెల్లించామని, ప్రతి నెల నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఫ్యాకేజీల రేట్లు రివైజ్ చేసి 22 శాతం మేరకు ఛార్జీలు పెంచామని తెలిపారు. హాస్పిటళ్ల యజమాన్యాలు లేవనెత్తిన ఇతర సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దామోదర రాజ నర్సింహ  తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)