ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు నారావారిపల్లెలోసంక్రాంతి సంబరాల వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులను చంద్రబాబు, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పరిశీలించారు. ఈ ముగ్గుల పోటీల్లో 126 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పోటీల్లో భాగంగా రంగవల్లులు తీర్చిదిద్దిన వారందరికీ రూ.10,116 చొప్పున కానుక ఇస్తున్నట్లు చెప్పారు. అందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు. పిల్లలకు నిర్వహించిన వివిధ రకాల పోటీలను చంద్రబాబు తిలకించారు. నారావారిపల్లెలో విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం సహా పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు, కుటుంబ సభ్యులు !
January 13, 2025
0
Tags