చైనా ఏఐ స్టార్టప్‌ను భారత సర్వర్ల నుంచే హోస్ట్ చేస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. డేటా ప్రైవసీకి సంబంధించిన ఆందోళనలను ఇది పరిష్కరిస్తుందని తెలిపారు. అలాగే ఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్‌ను సైతం ప్రారంభిస్తామని చెప్పారు. తక్కువ ఖర్చుతో రూపొందిన ఈ ఏఐ మోడల్ ఏఐ రంగంలో ప్రకంపనలు సృష్టించిందంటూ వైష్ణవ్ కొనియాడారు. రాబోయే కొన్ని నెలల్లో భారత్ సొంత జనరేటివ్ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసుకోబోతోందని అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. భారత దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏఐ మోడల్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఈ ఏఐ మోడల్ పూర్తిగా ఇండియా ఏఐ కంప్యూటర్ సామర్థ్యంతో రూపొందనుందన్నారు. మన దేశంలోని భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అతితక్కువ ఖర్చుతో ఈ ఏఐ మోడల్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. దేశీయ అవసరాల కోసం రూపొందించనున్న ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అభివృద్ధికి సుమారు 19 వేల జీపీయూలు అవసరమవుతాయన్నారు. ఇందులో 15వేల జీపీయూలు హైఎండ్‌వి అని తెలిపారు. ఇప్పటివరకు ఆరుగురు డెవలపర్లను గుర్తించామని, రాబోయే 8-10 నెలల్లో ఏఐ మోడల్‌ను సిద్ధం చేసే అవకాశం ఉందని చెప్పారు.
భారత సర్వర్లలో డీప్‌సీక్ ఏఐ హోస్ట్ చేస్తాం : అశ్విని వైష్ణవ్
January 30, 2025
0
Tags