ఎలక్ట్రిక్‌ కార్గో విభాగంలోకి టీవీఎస్‌ ప్రవేశం !

Telugu Lo Computer
0


టీవీఎస్‌ మోటార్‌ ఎలక్ట్రిక్‌ కార్గో విభాగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్‌ త్రీవీలర్‌ను కోల్‌కతా, యూపీ, బీహార్, జమ్ము, కాశ్మీర్‌తోపాటు ఢిల్లీలో విడుదల చేసింది. డిసెంబర్‌ నాటికి ఎలక్ట్రిక్‌ కార్గో రోడ్డెక్కనుందని టీవీఎస్‌ మోటార్‌ కమర్షియల్‌ మొబిలిటీ బిజినెస్‌ హెడ్‌ 'రజత్‌ గుప్తా' వెల్లడించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధన (సీఎన్‌జీ, ఎల్‌పీజీ, ఎలక్ట్రిక్‌) విభాగంలో కంపెనీ వాటా 10 శాతం ఉందని అన్నారు. తమిళనాడులోని హోసూర్‌ ప్లాంట్‌కు నెలకు 5,000 యూనిట్ల త్రిచక్ర వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. ఈ కేంద్రాన్ని మరింత విస్తరించవచ్చని వివరించారు. కొరియా నుంచి బ్యాటరీ సెల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. వీటిని భారతీయ భాగస్వామి తయారు చేస్తోందని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)