తీర్పు సంతృప్తికరంగా లేదు : మమతా బెనర్జీ

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై లైంగికదాడి కేసులో దోషి సంజయ్ రాయ్ కి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ ఈ తీర్పుపై తాను సంతృప్తి చెందలేదని అన్నారు. ''జూనియర్ వైద్యురాలి లైంగికదాడి ఘటనకు సంబంధించిన కేసులో దోషికి మరణశిక్ష విధించాలని మేమంతా డిమాండ్ చేశాం. కానీ, అలా జరగలేదు. ఈ కేసును బెంగాల్ పోలీసుల నుంచి బలవంతంగా సీబీఐకి బదిలీ చేశారు. ఒకవేళ ఈ కేసు దర్యాప్తు బెంగాల్ పోలీసుల చేతుల్లోనే ఉంటే దోషికి మరణశిక్ష పడేలా శాయశక్తులా ప్రయత్నించేవారు. అసలు విచారణ ఎలా జరిగిందో తెలియదు. రాష్ట్ర పోలీసులు విచారించిన ఇలాంటి అనేక కేసుల్లో దోషులకు మరణశిక్ష పడింది. ప్రస్తుత తీర్పు సంతృప్తికరంగా లేదు'' అని విలేకరుల ఎదుట సీఎం మమతా పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)